నిద్ర మత్తులో మంచంపై పక్కతడిపిన ప్రియుడిపై ప్రియురాలి కత్తిపోట్లు

  • అమెరికాలోని లూసియానాలో ఘటన
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు
  • పోలీసుల అదుపులో మహిళ
నిద్రలో తమ మంచంపై మూత్ర విసర్జన చేసినందుకు తన ప్రియుడిని ఓ యువతి కత్తితో పొడిచి హత్యాయత్నానికి పాల్పడింది. అమెరికాలోని లూసియానాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. మెడ, ఛాతిపై కత్తిపోట్లకు గురైన బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు బాధితుడు తన స్నేహితురాలు బ్రియానా లాకోస్ట్ (25)తో గత ఏడాదిన్నర కాలంగా సహజీవనం చేస్తున్నాడు. అయితే, శనివారం రాత్రి నిద్రలో అతను పక్క తడపడంతో లాకోస్ట్ తీవ్ర ఆగ్రహానికి గురైంది. నిద్రలేచిన వెంటనే అతడిని కొట్టడం ప్రారంభించింది.

ఆమె నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తగా.. వంటగదిలో కత్తితో లాక్టోస్ తనను పొడించిందని బాధితుడు పోలీసులకు చెప్పాడు. శనివారం రాత్రి బ్రియానా, బాధితుడు మద్యం సేవించి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. దాడి విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో బ్రియానా తన ప్రియుడు మంచంపై పక్క తడపడంతో కలత చెందానని అంగీకరించింది. అనంతరం ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గొడవలో ప్రియుడు తనను కొట్టడంతో అతడిని పొడిచి తనను తాను రక్షించుకున్నానని ఆమె పోలీసులకు తెలిపింది. తర్వాత అతడిని బ్రియానానే ఆసుపత్రికి తరలించింది.

US woman
stabs
boyfriend
peed in bed

More Telugu News